క‌రోనా క‌లిసొచ్చింది..తాళం వేసిన ఇల్లు క‌నిపిస్తే చాలు

క‌రోనా క‌లిసొచ్చింది..తాళం వేసిన ఇల్లు క‌నిపిస్తే చాలు

జ‌నం క‌రోనా క్రైసిస్ లో ఉంటే ఎల‌క్ట్రీషియ‌న్ అంటూ వ‌రుస ల్యాప్ టాప్ చోరీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల‌క్ట్రీషియ‌న్ ప‌నిచేస్తున్న రవి కిరణ్ జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. దీంతో ఈజీగా డ‌బ్బులు సంపాదించాల‌నే ప‌క్క‌ప్లాన్ తో క‌రోనా కార‌ణంగా స్వ‌గ్రామాల‌కు వెళ్లిన ఇళ్లు, బ్యాచ్ ల‌ర్ రూమ్ ల‌లో చోరీలు చేస్తున్నాడు. మీర్ పేట్ …ఎల్బీనగర్.. పహాడి షరీఫ్..వనస్థలిపురం ప్రాంతాల్లో దొరికి‌నంత దోచుకున్నాడు. ఇలా సుమారు 6.5ల‌క్ష‌ల విలువైన 43ల్యాప్ టాప్ ల‌ను చోరీ చేశాడు. వ‌రుస దొంగ‌త‌నాల‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ద‌ర్యాప్తులో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డింది ర‌వికిర‌ణ్ అని పోలీసులు గుర్తించారు.
ప‌లు కాల‌నీల‌ల్లో తాళం వేసి ఉన్న బ్యాచ్ ల‌ర్ రూమ్స్, ఇళ్ల‌ను టార్గెట్ చేసేవాడ‌ని పోలీసులు తెలిపారు. నిందితుడు ర‌వికిర‌ణ్ పై కోదాడ.. హనుమకొండ పీఎస్ లలో ప‌లు కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు చెప్పారు.