
రూ.80కే ఇళ్లంటే మనదేశంలో మధ్య తరగతి ప్రజలు సైతం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఈ పథకం మనదేశంలో కాదు ఇటలీలో. ఇటలీలో యూరప్ కు చెందిన ప్రజలు పట్టణాలు, గ్రామాల్ని వదిలేసి వలస వెళ్లిపోతున్నారు. దీంతో జనావాస ప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. అయితే వలసల్ని కట్టడి చేసేందుకు సిసిలీ ద్వీపం సంబూకా గ్రామం సంబూకా మేయర్ లియనార్డో సికాసియో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. సంబూకా గ్రామంలో ఖాళీ అయిన ఇళ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లను యజమానుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన ఇళ్లను ప్రపంచంలో ఎక్కడివారైనా సరే ఒక్కయూరో ఇచ్చి వాటిని సొంతం చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఒక్కయూరో పథకం కింద ఇళ్లను కొనుగోలు చేసిన నూతన యజమానులు శిథిలావస్థకు చేరిన ఇళ్లను మూడు సంవత్సరాల లోపే మరమ్మత్తులు చేసుకోవాలని షరతు విధించారు. ఈ మరమ్మత్తులకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉన్న ఇళ్లను కొనుగోలు చేసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. పచ్చదనంతో కూడిన ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న సంబూకా గ్రామంలో నివసించేందుకు పర్యావరణ ప్రేమికులు క్యూకడుతున్నారు. ‘ఒక్క యూరోకే ఇల్లు’ పథకం ప్రచారం జోరందుకోవడంతో ఇప్పటివరకు ఆ గ్రామంలోని 40 ఇళ్లు మార్కెట్ ధరకే అమ్ముడుపోయాయని మేయర్ లియానార్డో సికాసియో తెలిపారు.