జూరాలకు కొనసాగుతున్న వరద..విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్

జూరాలకు కొనసాగుతున్న వరద..విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్

గద్వాల, వెలుగు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి వరద కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తిని స్టార్ట్‌ చేయడంతో ప్రాజెక్ట్‌ గేట్లను క్లోజ్‌ చేసి నీటి విడుదల ఆపేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 50 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి 24,931 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1,500, రైట్‌కెనాల్‌కు 150 క్యూసెక్కులు కలిపి మొత్తం 26,581 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం హైడల్‌ ప్రాజెక్ట్​వద్ద అధికారులు పూజలు నిర్వహించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. జూరాల హైడల్ ప్రాజెక్ట్‌ 4 యూనిట్లు, లోయర్ జూరాల 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.