V6 News

తెలంగాణలో 3.2 శాతం కుటుంబాలకే సొంత కార్లు.. 22 శాతం కుటుంబాలకు సొంత ఫ్రిజ్‌లు..

 తెలంగాణలో 3.2 శాతం కుటుంబాలకే సొంత కార్లు.. 22 శాతం కుటుంబాలకు సొంత ఫ్రిజ్‌లు..

తెలంగాణలో  కులాల మధ్య ఆర్థిక స్థితిగతుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని  సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ ,కుల సర్వే ( SEEEPC) సర్వే వెల్లడించింది.  జీవన ప్రమాణాలు, ఆదాయం, భూ యాజమాన్యం వంటి కీలక అంశాలతో పాటు కారు, రిఫ్రిజిరేటర్ వంటి చరాస్తులు ,సంస్థాగత రుణాల లభ్యత వంటి 42 విభిన్న అంశాలపై ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. 

ఈ సంస్థ అధ్యయనం  ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 3.2 శాతం కుటుంబాలు మాత్రమే కారును కలిగి ఉన్నాయి. అంతేగాకుండా  షెడ్యూల్డ్ కులాల్లో 1.5 శాతం, షెడ్యూల్డ్ తెగల్లో 1.6 శాతం మందికి మాత్రమే కార్లు ఉండగా.. వెనుకబడిన తరగతుల్లో (BC) ఇది 2.3 శాతంగా ఉంది. కానీ  ఓపెన్ కేటగిరీ (OC) వర్గాల్లో మాత్రం ఇది 9.2 శాతంగా నమోదైంది. 

రిఫ్రిజిరేటర్ల విషయంలోనూ ఇదే అసమానత కొనసాగుతోంది. రాష్ట్రంలో సగటున 22.6 శాతం కుటుంబాలకు రిఫ్రిజిరేటర్లు ఉండగా.. SCలలో 15.7 శాతం, STలలో 17.7 శాతం మంది మాత్రమే వీటిని కలిగి ఉన్నారు. దీనికి భిన్నంగా BCలలో 23.6 శాతం, OCలలో అత్యధికంగా 35.9 శాతం మంది రిఫ్రిజిరేటర్లను వాడుతున్నారు.

అన్నిటికంటే ఆందోళన కలిగించే అంశం  బ్యాంకింగ్ వ్యవస్థ కంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం అనేది ఆర్థిక దుర్బలత్వానికి నిదర్శనం. రాష్ట్రంలో సగటున 6.8 శాతం కుటుంబాలు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తుండగా.. ఎస్టీలలో ఇది 9.7 శాతం, ఎస్సీలలో 8.8 శాతంగా ఉంది. ఓసీలలో ఈ సంఖ్య కేవలం 5.1 శాతానికే   అనధికారిక వడ్డీ వ్యాపారులపై ఈ స్థాయి ఆధారపడటం. అట్టడుగు వర్గాలను దోపిడీకి, దీర్ఘకాలిక రుణభారానికి గురిచేస్తోందని నిపుణుల బృందం హెచ్చరిస్తోంది.