ఈ అమ్మాయి కనిపిస్తే.. తరిమి కొట్టండి : ఎయిర్ పోర్ట్ అధికారుల ఆదేశాలు

ఈ అమ్మాయి కనిపిస్తే.. తరిమి కొట్టండి : ఎయిర్ పోర్ట్ అధికారుల ఆదేశాలు

ఎయిర్ పోర్ట్ అనగానే టైట్ సెక్యూరిటీ ఉంటుంది.. అందరూ ఓ రేంజ్ పీపుల్ ఉంటారు. అలాంటి ఎయిర్ పోర్టులో చిల్లర వేషాలు వేస్తే అస్సలు సహించరు. అటెన్షన్ కోసం ప్రయత్నిస్తే అస్సలు ఊరుకోరు. ఎందుకంటే గాల్లో ఎగిరే విమానంలో ఏ మాత్రం గందరగోళం ఏర్పడినా.. మిగతా ప్రయాణికుల భద్రతకు ముప్పు వస్తుంది. అందుకే ఎయిర్ పోర్ట్ లో కఠిన నిబంధనలు ఉంటాయి. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎందుకు అంటారా.. ఎయిర్ పోర్ట్ కు రావొద్దని.. విమానంలో ఎక్కటానికి వీల్లేదని ఓ అమ్మాయిపై నిషేధం విధించారు. దీనికి కారణం.. ఆ అమ్మాయి ధరించే దుస్తులు. ఈ అమ్మాయి ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల కనిపించినా తరిమి కొట్టండి అంటూ ఏకంగా ఎయిర్ పోర్ట్ అధికారులే ఆదేశాలు ఇవ్వటం విశేషం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎక్కడికైనా అర్జంట్ గా వెళ్లాలంటే ఫ్లైట్ లో వెళ్తాం.  ఇక సెలబ్రెటీలైతే చెప్పే పనిలేదు.  దాదాపుగావారి ప్రయాణాలన్నీ విమానాల్లోనే ఉంటాయి.  అయితే కొంతమందికి తప్ప ( ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు ఇలాంటి వారు) మిగతా వారిని ఎయిర్ పోర్ట్ నిబంధనల ప్రకారం తనిఖీ చేస్తారు.  అయితే వాళ్లలో  కొంతమంది విపరీత ధోరణిలో ఉంటే  ఇక వారిని విమానాశ్రయంలోకి రావడాన్ని నిషేధిస్తూ లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు.  ఇప్పుడు అలానే ఓ అమ్మాయికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను బ్రెజిల్ ఎయిర్ పోర్ట్ జారీ చేసింది. 

కైన్ చార్ (21) అనే మహిళకు బ్రెజిల్ ఎయిర్ పోర్ట్ షాకిచ్చింది.  విమానాశ్రయంలోకి రావద్దని నోటీసులు ఇవ్వడమే కాకుండా ఎయిర్ పోర్ట్ చుట్టు పక్కల కనిపిస్తే తరిమి కొట్టాలని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఏజన్సీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  కైన్ చాన్  ఓన్లీ ఫ్యాన్స్ లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుంది.  అయితే బ్రెజిల్ లోని నవేగాంటెస్ ఎయిర్ పోర్ట్ కు బికినీ డ్రస్ లో వచ్చింది.  ఎయిర్ పోర్ట్ అధికారులు దుస్తులు సరిగా లేవని అసభ్యకరంగా ఉన్నాయని చెప్పారు.  ఇది ఫిల్మ్, కామిక్స్ గేమింగ్ ఇష్టమైన వ్యక్తులు ధరించే డ్రస్ అని చెప్పింది.  దీనిని రెబెక్కా కాస్ ప్లే అని పిలుస్తారని తెలిపింది. రెబెక్కా కాస్ ప్లే సైబర్‌పంక్ ఎడ్జెరన్నర్స్‌లోని ఒక పాత్ర,  అది ఆమెకు ఇష్టమైన కారణంగా అలాంటి దుస్తులు ధరించానని చెప్పింది. 

అవి ఎలా ఉన్నాయంటే 

కైన్   ఒక ఈవెంట్‌కి వెళ్తున్నానని వివరించాను.కైన్  నలుపు బికినీ,  విగ్,  నల్ల చెప్పులు మాత్రమే ధరించి కనిపిస్తుంది. తాను సరైన దుస్తులు ధరించనందున విమానం ఎక్కలేదని చెప్పినట్లుపేర్కొంది. తాను  ఓ ఈవెంట్ కు వెళ్లాల్సి వచ్చిందని అక్కడ ఇలాంటి డ్రస్సే వేసుకోవాలసి వచ్చిందని కైన్ అన్నది.  ఆలస్యం అవుతుందని.. ఇప్పటికే చాలా లేట్ అయిందని.. డ్రస్ మార్చే సమయం కూడా ఉండదని అందువల్ల రెబక్కా డ్రస్ వేసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా ఆమెపై ఎయిర్ పోర్ట్ అధికారులు లు కౌట్ నోటీసులు జారీ చేశారు.