
మనం ఏదైనా సమాచారం కోసం లేదా దేనిగురించైనా తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్ క్రోమ్ పైనే ఆధారపడతాం. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో గూగుల్ క్రోమ్ వాడేవాళ్లు ఉన్నారు. అయితే టెక్నాలజీ అప్ డేట్ అవుతున్న కొద్దీ అన్ని స్మార్ట్'గా మారిపోతున్నాయి. దింతో OpenAI ఒకడుగు వేసింది.
ఓపెన్‌ఏఐ ఇప్పుడు గూగుల్‌కు పోటీ ఇచ్చేనందుకు రెడీ అవుతుంది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్లో మనం వాడే గూగుల్ క్రోమ్ లాంటి ఒక కొత్త బ్రౌజర్‌ను ఓపెన్‌ఏఐ త్వరలో తీసుకురాబోతోందట. ఈ బ్రౌజర్ కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్'తో పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఓపెన్‌ఏఐకి చెందిన ఈ కొత్త బ్రౌజర్ రానున్న వారాల్లోనే లాంచ్ కానుందట. ఈ బ్రౌజర్ మనం ఇంటర్నెట్‌ను వాడే విధానాన్ని మార్చేస్తుందని చెబుతున్నారు. ఓకే గూగుల్ లాగానే టైప్ చేయకుండ చాట్‌జీపీటీ (ChatGPT)లాగా ఏదైనా అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చట. దీనివల్ల ఓపెన్‌ఏఐకి యూజర్ల సమాచారం నేరుగా అందుతుంది. గూగుల్ సక్సెస్'కి కూడా ఇదే కారణం.
ప్రస్తుతం చాట్‌జీపీటీని సుమారు 50 కోట్ల మంది వాడుతున్నారు. వీళ్లంతా కూడా ఈ కొత్త బ్రౌజర్‌ను వాడటం మొదలుపెడితే గూగుల్ యాడ్స్ ఆదాయానికి ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా. ఎందుకంటే, గూగుల్ ఆదాయంలో దాదాపు మూడు వంతులు క్రోమ్ యాడ్స్ నుంచే వస్తుంది. ఈ కొత్త బ్రౌజర్ ఓపెన్‌ఏఐ మాస్టర్ ప్లాన్లో ఒక భాగం. ప్రజల వ్యక్తిగత జీవితంలో ఇంకా ఉద్యోగ పనుల్లో ఏఐని భాగం చేయాలని ఓపెన్‌ఏఐ చూస్తోంది.
ALSO READ : Tesla: ముంబైలో తొలి టెస్లా కార్ల షోరూమ్.. జూలై 15న ఓపెనింగ్..
ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు శ్యామ్ ఆల్ట్‌మాన్ తీసుకొచ్చిన ఓపెన్‌ఏఐ 2022 చివర్లో చాట్‌జీపీటీని విడుదల చేసి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గూగుల్ ఆంత్రోపిక్ వంటి కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పెర్‌ప్లెక్సిటీ అనే ఏఐ సెర్చ్ ఇంజిన్ కంపెనీ కామెట్ అనే ఏఐ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. అలాగే బ్రేవ్ లాంటి ఇతర ఏఐ స్టార్టప్‌లు కూడా ఏఐ బ్రౌజర్‌లను విడుదల చేశాయి. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ ప్రపంచంలోనే అత్యధికంగా వాడే బ్రౌజర్. దీన్ని 300 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. బ్రౌజర్ మార్కెట్‌లో మూడింట రెండు వంతుల వాటా క్రోమ్‌దే. ఆపిల్ సఫారీ 16 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
ఓపెన్‌ఏఐ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ తయారీకి వాడిన క్రోమియం అనే ఓపెన్ సోర్స్ కోడ్‌తోనే తయారవుతుందట. గతంలో గూగుల్ క్రోమ్ టీమ్‌లో పనిచేసిన ఇద్దరు అధికారులను ఓపెన్‌ఏఐ దాని టీమ్‌లోకి తీసుకుంది. అప్పుడే ఓపెన్‌ఏఐ బ్రౌజర్ తయారు చేయాలని అనుకుందట. OpenAI బ్రౌజర్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేయడం కాకుండా ChatGPT-వంటి చాట్ ఇంటర్‌ఫేస్‌లో కొన్ని యూజర్ ఇంటరాక్షన్‌లను రూపొందించిందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ విషయం పై OpenAI మాట్లాడేందుకు నిరాకరించింది.