గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకత

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకత

గుజరాత్ : బీజేపీ నేతలు తనపై దాడికి ప్రయత్నించారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సూరత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్ కు నిరసన తెగ తగిలింది. అసదుద్దీన్ రోడ్ షోలో ఉండగా పలువురు యువకులు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ బహిరంగ సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓవైసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  ఈ ఘటనపై అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలే తనను అడ్డుకున్నారంటూ ఫైర్ అయ్యారు. 

తాము విధానసభలో 13 స్థానాల కోసం పోరాడుతున్నామని ఓవైసీ చెప్పారు. ఆ స్థానాలను గెలుచుకోవడంపైనే దృష్టి ఉందన్న ఆయన..ప్రచారంలో ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారని,13 స్థానాలను తాము గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.