
హైదరాబాద్, వెలుగు : సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) టేబుల్ టెన్నిస్ టీమ్ టైటిల్ నెగ్గింది. బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో జరిగిన ఈవెంట్‌లో మొహమ్మద్ అలీ, వరుణ్ శంకర్, రాజు, కేశవన్ కన్నన్, ప్రణవ్ నల్లారితో కూడిన టీమ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఓయూ టీమ్ 3–1తో ఎస్‌ఆర్‌ఎం (తమిళనాడు) జట్టును ఓడించింది.
ఈ విజయంతో ఓయూ టీమ్ ఈ నెల 9 నుంచి పంజాబ్‌లోని చిక్తార యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీస్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అయ్యింది.