ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. సస్పెన్స్, రివేంజ్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న లేటెస్ట్ కన్నడ మూవీ ‘శేష 2016’. శుక్రవారం మే 22 నుంచి సన్ నెక్ట్స్‌లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పోలీస్ వ్యవస్థలోని చీకటి కోణాలు, అవినీతి, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒకే రాత్రిలో జరిగే ఉత్కంఠభరిత కథతో ఆకట్టుకుంటోంది.
సస్పెన్స్, సైకాలజికల్ థ్రిల్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీని ప్రదీప్ అర్సిరే ఇంట్రెస్టింగ్ వేలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అంతే ఉత్కంఠగా తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అవినీతికి పాల్పడిన కొందరు పోలీస్ అధికారులను ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తాడు. బయట భారీ వర్షం, లోపల భయం, అనుమానాల మధ్య ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ఒకరినొకరు అనుమానిస్తూ సంఘర్షణలకు దిగుతారు.
అయితే, ప్రస్తుతం ఈ మూవీ కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు స్ట్రీమింగ్ అప్డేట్ లేకపోవడం నిరాశ కలిగించే విషయం అయినప్పటికీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. త్వరలోనే మేకర్స్ తెలుగు స్ట్రీమింగ్ సైతం అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఇందులో జాన్ కైపల్లిల్, ప్రమోద్ శెట్టి, దేవరాజ్, అర్చన కొట్టిగె, శ్రీజిత్ రవి, యష్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.
#Sesha2016 (Kannada)
— OTT Trackers (@OTT_Trackers) May 22, 2026
Now streaming on Sunnxt in Kannada & Malayalam 🍿!!#OTT_Trackers pic.twitter.com/u2K9Lim71J
కథేంటంటే:
కర్ణాటక–కేరళ సరిహద్దుల్లోని పుష్పగిరి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఒకే రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆంథోని వర్గీస్ (ప్రమోద్ శెట్టి) ఒక కేసు దర్యాప్తు చేస్తుంటాడు. అందులో భాగంగా దగ్గర్లోని క్రికెట్ గ్రౌండ్ నుంచి ఒక యువకుడిని స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కొడతాడు. ఆ తర్వాత ఒకరోజు స్టేషన్‌లోని సగం మంది పోలీసులు దసరా ఉత్సవాల బందోబస్తు కోసం వెళ్తారు. ఆంథోని, ఏఎస్ఐ గీత (అర్చన కొట్టిగె), కొంతమంది కానిస్టేబుళ్లు మాత్రమే డ్యూటీలో ఉంటారు. ఆంథోని డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. గీత మాత్రం పెండింగ్ వర్క్ పూర్తి చేయడానికి అక్కడే ఉండిపోతుంది. అప్పుడే ఆంథోనిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, చంపేస్తారు.
►ALSO READ | Drishyam 3 Box Office: ‘దృశ్యం 3’ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి
సబ్ ఇన్‌స్పెక్టర్ దాస్ (జాన్ కైపల్లిల్) స్టేషన్‌కు చేరుకున్నాక ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ తర్వాత గీతతోపాటు స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు స్థంభించిపోయిన కమ్యూనికేషన్ వ్యవస్థలు.. అలాంటి పరిస్థితుల్లో ఆ హంతకుడి నుంచి మిగిలిన పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకోగలిగారా? లేదా? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
ఈ సినిమా ప్రధాన బలం స్క్రీన్‌ప్లే. మొదటి నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కొనసాగించేలా దర్శకుడు కథను నడిపించారు. పోలీస్ వ్యవస్థలో జరిగే అవినీతి, అధికార దుర్వినియోగం, కస్టడీ హింస వంటి అంశాలను కథలో సహజంగా మిళితం చేశారు. భారీ వర్షం, చీకటి వాతావరణం, ఒంటరిగా మారిన పోలీస్ స్టేషన్ వంటి అంశాలు కథలో టెన్షన్‌ను మరింత పెంచాయి.
కేవలం ఫిజికల్ యాక్షన్ కాకుండా, పాత్రల మధ్య మానసిక ఒత్తిడి, అనుమానాలు కూడా ప్రేక్షకులను కథలోకి లాగుతాయి. నటీనటుల విషయానికి వస్తే ప్రమోద్ శెట్టి, జాన్ కైపల్లిల్, అర్చన కొట్టిగె తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా భయం, గందరగోళం, సర్వైవల్ ఎమోషన్స్‌ను బాగా చూపించారు.
ఫైనల్‌గా: సస్పెన్స్, రివేంజ్, సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘శేష 2016’ మంచి ఛాయిస్.
