వరుసు​కు అక్కా చెల్లెలు..పెళ్లితో ఒక్కటయ్యారు

వరుసు​కు అక్కా చెల్లెలు..పెళ్లితో ఒక్కటయ్యారు

వారణాసి: అక్కాచెల్లెల బంధం విడదీయరానిది అని అందరికీ తెలుసు. అయితే క్లోజ్ గా ఉండే అక్కాచెల్లి జీవితాంతం అలాగే ఉండాలనుకున్నారో ఏమోగానీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ లో జరిగింది.  వరుసు​కు అక్కా చెల్లెలు అయ్యే ఇద్దరు యువతులు బుధవారం స్వలింగ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి సంబంధించిన ఫోటలోను వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీరు కుటుంబ మర్యాదలను వ్యతిరేకిస్తూ..  వారణాసిలో వివాహం చేసుకున్నారు.

ఇటువంటి స్త్రీ స్వలింగ వివాహం జరగటం వారణాసి చరిత్రలో ఫస్ట్ టైం అని పలువులు అభిప్రాయపడుతున్నారు. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెళ్లి వరుసు అయ్యే మరో యువతి.. ఇద్దరు వివాహం చేసుకోవాలని వారణసికి సమీపంగా ఉన్న రోహానియా ప్రాంతంలోని శివాలయంకి వెళ్లారు. వీరు ఆ శివాలయం వెళ్లేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుడదని.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. వీరి ఇరువురికి వివాహం జరిపించాలని శివాలయం పూజారిని కోరారు.  వీరి వివాహం జరిపించడానికి పూజారి నిరాకరించారు.

వారు అక్కడే భిష్మించుకొని కూర్చోవడంతో పూజారి వివాహ తంతును పూర్తి చేశారు.  స్త్రీ స్వలింగ వివాహం​ జరిపించినందుకు పూజారిని పలువురు విమర్శిస్తున్నారు. పెళ్లిపై అవగాహన లేకనే వీరు అలా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.