కరోనా దెబ్బకు 154 కోట్ల మంది విద్యార్థులు పరేశాన్

కరోనా దెబ్బకు 154 కోట్ల మంది విద్యార్థులు పరేశాన్

కరోనా వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు నష్టపోతారని యునెస్కో అంచనా వేసింది. కరోనా నిర్మూలనకు దేశాలన్నింటిలో లాక్డౌన్ విధించారు. దాంతో అన్ని రంగాల సంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా దెబ్బ విద్యార్థులపై ఎక్కువగా పడింది. విద్యాసంస్థలను మూసివేయడం ద్వారా విద్యార్థలు తమ విద్యా సంవత్సరాన్ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా బాలికలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. లాక్డౌన్ వల్ల బాలికల డ్రాప్-అవుట్ రేట్లు పెరగే చాన్స్ ఉంది. అంతేకాకుండా.. ఈ లాక్డౌన్ వల్ల విద్యారంగంలో కూడా లింగ అంతరాలను మరింత పెరుగుతాయని యునెస్కో వ్యాఖ్యానించింది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పాఠశాలలను మూసివేయడం వల్ల కౌమారదశలో ఉన్న బాలికల డ్రాప్-అవుట్లు పెరిగే అవకాశం ఉందని యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియానిని హెచ్చరించారు. ఈ కరోనా ప్రభావం విద్యరంగంలో లింగ అంతరాలను పెంచడంతో పాటు.. మైనర్ వివాహాలు పెరగడానికి కారణమవుతందని ఆమె అన్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రస్తుతం 89 శాతం మంది చదువుకు దూరమయ్యారని మేం అంచనా వేస్తున్నాము. అది పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న 154 కోట్ల మంది విద్యార్థులకు సమానం. ఇందులో దాదాపు 74 కోట్ల మంది బాలికలు ఉన్నారు. దాదాపు 11 కోట్ల మంది బాలికలు ప్రపంచంలోనే తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో నివసిస్తున్నారు . అక్కడ విద్యను పొందడం ఇప్పటికే కష్టంగా ఉంది. ఇప్పడు కరోనా వల్ల మరింత క్లిష్టం కానుంది. చాలా దేశాలలో ప్రభుత్వాలు పాఠశాలలను నిరవధికంగా కొంతకాలం పాటు మూసివేయాలని భావిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలు గతంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాలి. అంతేకాని పాఠశాలలను మూసివేయకూడదు. పాఠశాలలు మూసివేస్తే.. శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న విద్యార్థులు మరియు అనాథ బాలికలకు చాలా పెద్ద సమస్య అవుతుంది. అంతేకాకుండా పేద విద్యార్థలు మళ్లీ పాఠశాలలు తెరచిన తర్వాత రావడానికి ఇష్టపడరు. ఎందుకుంటే తమ కుటుంబాలకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండాలని భావిస్తారు.

అందుకే యునెస్కో ఆరు పాయింట్ల వ్యూహాన్ని సూచిస్తుంది. అందులో ఉపాధ్యాయులు మరియు సంఘాలను ప్రోత్సహించడం, సోషల్ డిస్టెన్స్ అవలంబించడం, డిజిటల్ పాఠాలు బోధించడం, కీలకమైన కొన్నిసేవలను పరిరక్షించడం మరియు విద్యను అందించడంలో యువతను నిమగ్నం చేయడం వంటివి ఉన్నాయి’’ అని స్టెఫానియా జియానిని తెలిపారు.

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. వీటిలో దాదాపు 80 శాతం కేసులు యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో నమోదయ్యాయి. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 25,71,515 కేసులు నమోదుకాగా.. 1,78,281 మరణాలు నమోదయ్యాయి.

For More News..

కరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య

ఆటలో గొడవ.. ఒకరిని చంపి కాల్చేసిన స్నేహితులు

ఆట అంటే వీళ్ళది.. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి టెన్నిస్.. వీడియో వైరల్

‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’