
భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఈ విషయాన్ని పాక్‌కు చెందిన మీడియా సంస్థ తెలిపింది. దీంతో పాక్ నుంచి అటారీకి రావల్సిన భారత ప్రయాణికులు లాహోర్ రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయారు. అయితే భారత ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా వాఘా సరిహద్దుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు చెప్పారు. మరోవైపు పాక్ నిర్ణయంతో బుధవారం ఢిల్లీ నుంచి ప్రారంభమైన రైలు భారత చివరి రైల్వే స్టేషన్ అయిన అటారి దగ్గర రైలు నిలిచిపోయింది.