మోడీ.. దయ చేసి కూర్చుని మాట్లాడుకుందాం: పాక్ ప్రధాని

మోడీ.. దయ చేసి కూర్చుని మాట్లాడుకుందాం: పాక్ ప్రధాని
  • యుద్ధం వస్తే ఎవరి కంట్రోల్ లోనూ ఉండదు.. ఎటు పోతుందో చెప్పలేం
  • పుల్వామా ఘటనపై మీ బాధ అర్థం చేసుకోగలను
  • దానిపై విచారణకు సిద్ధం.. మేం శాంతినే కోరుకుంటున్నాం
  • పాక్ లో భారత్ దాడి వల్లే మేం ప్రతిదాడి చేశాం
  • ఎన్నికలు వస్తుండడంతోనే భారత్ దాడి: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: యుద్ధం అంటూ మొదలైతే ఎంత దూరం పోతుందో చెప్పలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒక సారి వార్ స్టార్ట్ అయితే దాన్ని కంట్రోల్ చేయడం నరేంద్ర మోడీ చేతుల్లోనే, లేదా తన చేతుల్లోనో ఉండదని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పారాయన. కూర్చుని మాట్లాడుకుదాం.. చర్చలతోనే సమస్య పరిష్కరించుకుందాం అని భారత్ ను కోరారు.

మాకూ సత్తా ఉంది

పుల్వామా ఘటనతో భారతీయుల్లో ఉన్న పెయిన్ ను తాను అర్థం చేసుకోగలనని ఇమ్రాన్ చెప్పారు. హింసాకాండ వల్ల ఆస్పత్రుల్లో చేరిన వాళ్లు పడే బాధను తాను స్వయంగా చూశానన్నారు. పుల్వామా దాడిపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, బారత్ సహకరించాలని అన్నారు. ఈ ఘటన తర్వాత పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్పామన్నారు. ఇండియాను చర్చలకు రావాలని కోరామని, కానీ పాకిస్థాన్ లోకి వచ్చి దాడి చేశారని అన్నారు. తమ దేశాన్ని రక్షించుకునే సత్తా ఉందని చూసించేందుకే ప్రతి దాడి చేశామని చెప్పారు. భారత వాయుసేన యుద్ధ విమానాలను రెండింటిని కూల్చామన్నారు.

భారత్ లో ఎన్నికలు.. అందుకే దాడి

పాకిస్థాన్ ఉగ్రవాదులు అడ్డాగా వాడుకోవడాన్ని తాము సపోర్ట్ చేయబోమని ఇమ్రాన్ చెప్పారు. అయితే భారత్ నేరుగా పాక్ లోకి వచ్చి వైమానిక దాడి చేయడంతో తాము ప్రతి దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు. తాము పుల్వామా విషయంలో చర్చలకు పిలిచినా భారత్ దాడికి దిగడానికి కారణం ఆ దేశంలో త్వరలో ఎన్నికలు ఉండడమేనని ఇమ్రాన్ అన్నారు.

వార్ వద్దు

ప్రపంచ చరిత్రలో అన్ని యుద్ధాలు మిస్ క్యాలిక్యులేషన్ (సరైనా అంచనా లేకపోవడం) వల్లే జరిగాయని ఇమ్రాన్ అన్నారు. యుద్ధం ఒకసారి మొదలైతే దాన్ని ఆపడం మొదలు పెట్టిన వారి చేతుల్లో ఉండదని చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం ఆరేళ్ల పాటు ఆగలేదని అన్నారు. ఇరు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూ మనకు ఉన్న ఆయుధ శక్తితో సరైన అంచనా లేకుండా యుద్ధానికి దిగడం మంచిది కాదని ఇమ్రాన్ చెప్పారు. వార్ స్టార్ట్ అయితే దాన్ని ఆపడం మోడీ చేతులోనో, తన చేతులోనో ఉండదని అన్నారు. దయ చేసి కూర్చుని మాట్లాడుకుని, సమస్యన పరిష్కరించుకుందామని ఇమ్రాన్ పలుమార్లు కోరారు.