
న్యూఢిల్లీ: బార్డర్లో యుద్ధమేఘాలు అలుముకున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ శుక్రవారం రావల్పిండిలో సైన్యం స్పెషల్ కోర్ కమాండర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత పాక్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తెలిపింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేయవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
ఇండియాతో ఉద్రిక్తతలు, ప్రాంతీయ భద్రతపై ఈ సమావేశంలో చర్చించినట్టు వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ రాజకీయం చేస్తోందని చెప్పుకొచ్చింది. భారత్ తన అంతర్గత వైఫల్యాలను అంతర్జాతీయ సంక్షోభాలుగా చూపిస్తోందని.. పుల్వామా, పహల్గాం వంటి సంక్షోభాలను రాజకీయ, మిలిటరీ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించింది.