పాకిస్తాన్ యువకులకు బలవంతంగా ఉగ్రవాద శిక్షణ..

పాకిస్తాన్ యువకులకు బలవంతంగా ఉగ్రవాద శిక్షణ..

పాకిస్తాన్ యువకులకు బలవంతంగా ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, బలుచిస్తాన్, ఖైబర్ పఖ్తున్వా ప్రాంతాలలో డజనుకు పైగా ఉగ్రవాద శిక్షణా శిభిరాలు ఉన్నట్లుగా భారత ఇంటలీజెన్స్ కు సమాచారం అందింది. దీంతో పాటు ఉపగ్రహ చాయా చిత్రాలలో ఉగ్రవాద శిక్షణా శిభిరాలు కనిపించాయి. ఒక్కో శిభిరంలో 700మందికి పైగా ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాంటి శిభిరాలు దాదాపుగా 20దాకా ఉన్నట్లు సమాచారం. 92శాతం 35సంవత్సరాలలోపు వయసున్నవారుకాగా, 12శాతం యువకులు 18ఏళ్ల వయసున్నవారున్నారని తెలిసింది.  వీరికి ప్రార్థనలు చేసుకోడానికి మసీదులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులు ఉన్నాయి.

పాకిస్తాన్ ఉగ్రచర్యలను కంట్రోల్ చేయాల్సింది పోయి… వేల సంఖ్యలో  యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలేదని ఓ భద్రతా అధికారి అన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ బ్లాక్ జోన్ లో పడిపోతుందని చెప్పారు.  జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదులు రాకుండా బార్డర్ వద్ద ఇనుప కంచె నిర్మిస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అనడంతో పాకిస్తాన్ లోవున్న డీ-రాడికలైజేషన్ శిభిరాలు చర్చనీయాంశం అయ్యాయి.