పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విషాదం : ఆఫ్రిది సోదరి కన్నుమూత

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విషాదం : ఆఫ్రిది సోదరి కన్నుమూత

పాకిస్థాన్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్ను మూసారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న అఫ్రిది సోదరి మంగళవారం (అక్టోబర్ 17, 2023) మరణించినట్లు షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ప్రకటించారు.

మా ప్రియమైన సోదరి మరణించిందని భారమైన హృదయంతో మీకు తెలియజేస్తున్నాను.ఆమె నమాజ్ ఇ జనాజా 17.10.2023 ఇ గాలిబ్ DHA వద్ద జుహుర్ ప్రార్థన తర్వాత ఉంటుంది. అని ఆఫ్రిది ట్విట్టర్ లో తెలిపాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన పాకిస్థాన్ క్రికెటర్లలో ఒకరైన అఫ్రిదికి 11 మంది తోబుట్టువులు ఉన్నారు, ఇందులో ఆరుగురు సోదరులు మరియు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. 

Also Read :- ఫస్ట్ క్లాస్ క్రికెట్‪లో ఆల్‌టైం రికార్డ్

వీరిలో అఫ్రిదీ ఐదవవాడు. అతని సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫాక్ అఫ్రిది ఇద్దరు కూడా క్రికెట్ ఆడిన వారే. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగిన షాహీన్ అఫ్రిదీ..ఇతనికి అల్లుడు. ఇటీవలే షాహిద్ అఫ్రిదీ కుమార్తెను షాహీన్ అఫ్రిదీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.