పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ ను భారత్ పై దాడికి వాడిన విషయంపై అమెరికా ఆచి తూచి వ్యవహరిస్తోంది. యూఎస్ విదేశాంగ శాఖ మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో సమాధానమిచ్చారు. ఆ రిపోర్టులు తాము చూశామని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ F -16 యుద్ధ విమానాన్ని వాడిన విషయాన్ని తాము ఇప్పుడే నిర్ధారించలేమంది అమెరికా. దీనిపై బహిరంగంగా సమాధానం చెప్పలేనని క్లారిటీ ఇచ్చింది. యూఎస్ రక్షణశాఖ ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో పూర్తి పరిశీలన తర్వాతే మాట్లాడుతామని అమెరికా చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ F-16 ను వాడిందని, తాము దాన్ని కూల్చేశామని, ఆ విమానం ఆధారాలను భారత్.. ఇప్పటికే అమెరికాకు అందజేసింది. ఒప్పంద సమయంలో F-16 ను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే వాడాలని అమెరికా పాకిస్తాన్ కు సూచించింది. కానీ ఫిబ్రవరి 27న భారత్ పైకి F 16 ను దాడికి పంపింది పాకిస్తాన్.
