
కుల్ భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే తీర్పు తమకు అనుకూలంగా ఉందన్న పాక్ తీరుపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. జాదవ్ కేసులో ఐసీజే తీర్పును పాక్ తప్పుగా అర్థం చేసుకుందన్నరవీశ్ కుమార్ వారికి తీర్పును పూర్థిస్థాయిలో చదివే ఓపిక లేదన్నారు. ఐసీజే 42 పేజీలలో తీర్పు వెల్లడించదన్న రవీశ్ కుమార్, ప్రెస్ కు రిలీజ్ చేసిన 7 పేజీలను పాక్ చదవాలని సూచించారు. అందులో మొత్తం భారత్ కు అనుకూలంగా ఉందని చెప్పారు.