‘జాదవ్ కేసులో పాకిస్తాన్‌ రూల్స్ పాటించలేదు’

‘జాదవ్ కేసులో పాకిస్తాన్‌ రూల్స్ పాటించలేదు’
  • వియన్నా కన్వెన్షన్​ను ఉల్లంఘించింది
  • యునైటెడ్ నేషన్స్​కు ఐసీజే ప్రెసిడెంట్ వివరణ
  • యూఎన్​జీఏకు రిపోర్టు

యునైటెడ్ నేషన్స్: ఇండియన్ నేవీ రిటైర్డ్ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయంగా ఇండియా మరోసారి విజయం సాధించింది. జాదవ్ విషయంలో వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ఉల్లంఘించిందని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ)కి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ప్రెసిడెంట్ జడ్జి అబ్దుల్ఖావి యూసుఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ రిపోర్టు  ఇచ్చారు. జాదవ్ కేసులో కోర్టు చెప్పిన తీర్పులోని పలు అంశాలను యూఎన్ జనరల్ అసెంబ్లీ ముందు యూసఫ్ వివరించారు.

ఆర్టికల్ 36 పూర్తిగా అమలవుతుంది

వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 36లో పేర్కొన్న రూల్స్ను పాక్ ఉల్లంఘించిందని యూసఫ్ చెప్పారు. వియన్నా కన్వెన్షన్లో గూఢచర్యం కేసులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వకూడదనే రూల్కూడా ఏదీ లేదని వివరించారు. జాదవ్ కేసులో వియన్నా  ఒప్పందంలోని ఆర్టికల్ 36 (కాన్సులర్ అనుమతి)  పూర్తిగా అమలవుతుందని స్పష్టం చేశారు. పాక్ రూల్స్కు విరుద్ధంగా జాదవ్ను నిర్బంధించిందని చెప్పారు.

‘విత్ఔట్ డిలే’ను మరోలా అర్థం చేసుకుంది…

ఆర్టికల్ 36లోని ‘ఆలస్యం చేయకుండా’ అనే అంశాన్ని పాకిస్తాన్ మరోలా అర్థం చేసుకుందని యూఎన్జీఏకు యూసఫ్ చెప్పారు. ‘‘వియన్నా ఒప్పందం ప్రకారం.. జాదవ్ కేసులో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అతడిని అరెస్ట్ చేసిన మూడు వారాల తర్వాత.. ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ ఓ నోటిఫికేషన్ జారీచేసి  ఇండియా కాన్సులేట్కు సమాచారం ఇవ్వాలి. కానీ, పాక్ అలా చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించింది” అని వివరించారు. జాదవ్కు పాక్ విధించిన మరణశిక్షపై స్టే విధిస్తూ జులై 17న ఐసీజే తీర్పు చెప్పింది. కేసును రివ్యూ చేయాలని ఆదేశించింది. ఐసీజేలోని 16 మంది జడ్జిల్లో 15 మంది ఇండియాకు అనుకూలంగా తీర్పు చెప్పారు. పాక్కు వంతపాడే చైనాకు చెందిన జడ్జి కూడా కులభూషణ్కు అనుకూలంగా తీర్పుకు ఆమోదముద్ర వేశారు. తర్వాత జాదవ్కు కాన్సులర్ అనుమతి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్లో ఒకసారి అనుమతి ఇచ్చిన పాక్.. తర్వాత యాక్సెస్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Pakistan in violation of international rules in Kulbhushan Jadhav case