రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష

రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష

అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా మగతనాన్ని తగ్గించే శిక్షను అమలు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ప్రధానిగా ఆయన ఆమోద ముద్ర వేశారు. అంతేకాకుండా ఈ శిక్షకు ఫెడరల్ క్యాబినెట్ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను న్యాయ మంత్రిత్వ శాఖ కేబినేట్‌లో సమర్పించింది. పోలీసింగ్, ఫాస్ట్ ట్రాకింగ్ రేప్ కేసులు మరియు సాక్షికి రక్షణ కల్పించడం వంటివి ఈ ముసాయిదాలో పొందుపరచబడ్డాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

రేప్ కేసుల విషయంలో ఆలస్యం పనికిరాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కఠినమైన ఈ చట్టం అమలుతో కేసులన్నీ స్పష్టంగా మరియు పారదర్శకంగా దర్యాప్తు చేయబడతాయి. అత్యాచారానికి గురైన వారు కూడా భయం లేకుండా ఫిర్యాదు చేయగలరు. అలాంటి వారి గుర్తింపును ప్రభుత్వం కాపాడుతుంది’ అని ఇమ్రాన్ అన్నారు.

అత్యాచారం చేసిన దోషులను బహిరంగంగా ఉరి తీయాలని కొంతమంది మంత్రులు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టాన్ని త్వరలోనే పాక్ పార్లమెంటులో ప్రవేశపెడతామని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సెనేటర్ ఫైసల్ జావేద్ ఖాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో పాకిస్తాన్‌ పార్లమెంటులో అత్యాచార చట్టాల గురించి చాలా చర్చలు జరిగాయి.

2018 జనవరిలో లాహోర్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య జరిగింది. ఆ తర్వాత అదే లాహోర్లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. దాంతో మహిళ సాయం కోసం రోడ్డు మీద నిలబడింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు ఆమెను చూసి ఆగారు. సాయం చేస్తామంటూ దగ్గరికొచ్చి.. మహిళను బెదిరించి పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతటా నిరసనలు రేకెత్తాయి. వందలాది మంది మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికే ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో త్రీ-టైర్ చట్టాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతుందని ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ఇమ్రాన్ తెలిపారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

బిజీగా ఉన్న మార్కెట్‌లో బాంబు దాడి.. 17 మంది మృతి