
సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్టు పాక్ నిర్ణయం తీసుకోవడంతో.. సరిహద్దులో ఆగిపోయిన రైలును అట్టారీ తీసుకొచ్చారు అధికారులు. అట్టారీ స్టేషన్ నుంచి ఇంజిన్ తీసుకెళ్లి.. రైలును తీసుకొచ్చారు. రైలులో 110 మంది ప్రయాణికులు ఉన్నారని నార్త్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ చెప్పారు.
పాకిస్థాన్ నుంచి భారత్ కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్ ప్రెస్.. లాహోర్ నుంచి వాఘా వరకు వచ్చి ఆగిపోయింది. వాఘా నుంచి అట్టారి వచ్చేందుకు రైలు డ్రైవర్, గార్డ్ నిరాకరించారని నార్త్ రైల్వే అధికారులు చెప్పారు. భద్రతా కారణాలతో తాము.. భారత్ లోకి రాలేమని తేల్చి చెప్పారు. దీంతో భారత్ రావాల్సిన ప్రయాణికులు.. నాలుగైదు గంటల పాటు వాఘాలో ఆగిపోయారు. దీంతో అట్టారి నుంచి ఇంజిన్ పంపించి ప్రయాణికులను తీసుకొచ్చారు అధికారులు.