చైనాలోనే పాక్ విద్యార్ధులు..చేతులెత్తేసిన ఇమ్రాన్ సర్కార్

చైనాలోనే పాక్ విద్యార్ధులు..చేతులెత్తేసిన ఇమ్రాన్ సర్కార్

చైనాలోని వుహాన్ ప్రాంతంలో చిక్కుకున్న పాక్ విద్యార్ధులు తమని కరోనా వైరస్ నుంచి కాపాడాలని ఆ దేశ ప్రభుత్వ యంత్రాగాన్ని కోరుకుంటున్నారు. అయితే పాక్ ఎంబసీ అధికారులు మాత్రం చైనాలో జాగ్రత్తగా ఉండాలని, స్వదేశానికి వచ్చే ప్రయత్నం చేయోద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడేందుకు మెడిసిన్ లేదని చైనాలోని  పాక్ రాయబారి  తమకు చెప్పినట్లు పాక్ కు చెందిన మీడియా సంస్థ తెలిపింది.

  • వుహాన్ లో ఉన్న ఐదుగురు పాక్ విద్యార్ధులకు సోకిన కరోనా వైరస్
  • తమని కాపాడాలని కన్నీటి పర్యంతమవుతున్న పాక్ విద్యార్ధులు
  • చైనా వూహాన్ లో ఉంటున్న పాక్ విద్యార్ధులు అక్కడే ఉండాలని సూచించిన పాక్  అంబాసీడర్ నగ్మనా హష్మీ
  • వుహాన్ లో కరోనా వైరస్ ను అరికట్టే మెడిసిన్ చైనాలో ఉందంటూ పాక్ కు చెందిన చైనా అంబాసీడర్  మీడియాకు వెల్లడి

చైనాలో కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి చైనాలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ఇండియన్ గవర్నమెంట్ భారతీయుల్ని స్వదేశానికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారతీయుల్ని విమానాల ద్వారా చైనా నుంచి భారత్ కు తెచ్చేలా చర్యలు తీసుకుంటుంది.

అయితే అందుకు భిన్నంగా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ కు చెందిన చైనా అంబాసీడర్ నగ్మానా హష్మీ  పాక్ కు చెందిన జియో న్యూస్ సంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పాక్ అంబాసీడర్ మాట్లాడుతూ వుహాన్ లో ఉంటున్న పాక్ దేశస్థులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. పాక్ లో కరోనా వైరస్ ను అదిగమించే మెడిసిన్ లేదని తెలిపారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత వుహాన్ లో  పాక్ దేశస్థులు ఉండే ప్రాంతాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు హాష్మీ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు పాక్ మీడియా సంస్థ జియో న్యూస్ ప్రకటించింది.

అంతేకాదు వుహాన్‌లో ఆహార కొరత, ఇతర సమస్యల గురించి పాక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని,  వారి సమస్యల గురించి రాయబార కార్యాలయానికి పూర్తిగా తెలుసునని, హుబీ ప్రావిన్స్‌లోని చైనా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని హష్మీ చెప్పారని జియో న్యూస్ వెల్లడించింది.

పాకిస్తాన్ రాయబార కార్యాలయం మరియు చైనా ప్రభుత్వం సంయుక్తంగా తమ సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేస్తున్నాయని, నేను మా పౌరులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం, ప్రావిన్స్ నిర్బంధంలో ఉంది. ఎవరినీ వెళ్ళడానికి అనుమతించలేదు. ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే, మన దేశస్థులతో ఉండేలా చర్యలు తీసుకుంటామని ”అని జియో న్యూస్  పేర్కొంది.

అయితే వుహాన్ లో ఉంటున్న తమ పిల్లల్ని కాపాడాలని పాక్ ప్రజలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తిపై స్పందించిన పాక్ ప్రభుత్వం పౌరులను తీసుకురాబోమని ప్రకటించింది. ఆ తర్వాత రోజే చైనాలోని పాక్ రాయబారి నగ్మనా హష్మీ నుండి ఈ ప్రకటన వచ్చినట్లు సమాచారం.

అయితే పాక్ రాయబారి ప్రకటనపై ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవలపై ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్న డాక్టర్ జాఫర్ మీర్జా మాట్లాడుతూ ప్రపంచం, చైనా,తమ దేశ అవసరాల దృష్ట్యా వుహాన్ నుంచి పాక్ కు తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు.

ఇదిలా ఉంటే వుహాన్ లో ఉన్న భారతీయుల్ని కేంద్రప్రభుత్వం స్వదేశానికి తెస్తుండగా..వుహాన్ లో ఉంటున్న పాక్ దేశస్థులు తమని కాపాడాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం పట్టనట్లుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

భారత్ కు చెందిన తన సహచర విద్యార్ధులు వుహాన్ ను వదిలి వెళుతుండగా..తమని కాపాడాలంటూ  ప్రభుత్వాన్ని కోరుతూ.. పాక్ విద్యార్ధులు ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.