
పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది. మిస్సైల్ పరీక్ష కోసం పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. పాక్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణికి అణ్వాయుధాలను, జీవరసాయనిక ఆయుధాలను తీసుకెళ్లే. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోనుపాక్ ట్వీట్ చేసింది. భారత్ తో యుద్ధం తప్పదని పదే పదే ప్రకటిస్తున్న పాక్.. క్షిపణిని ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.