
వచ్చే ఫిబ్రవరిలోగా తీరు మార్చుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్
పారిస్: ‘‘మేం రూపొందించిన 27 పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను ఫిబ్రవరి 2020లోగా పూర్తి చేయండి. లేదా మేం తీసుకోబోయే కఠిన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’’ అని పాకిస్తాన్‌కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వార్నింగ్ ఇచ్చింది. పాక్‌ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్లు ఎఫ్ఏటీఏ ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్ నుంచి పాకిస్తాన్ తప్పించుకుంది. మనీ లాండరింగ్‌ను అరికట్టడంలో, టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయడంలో పాక్ ఫెయిల్ అయిందని ఎఫ్ఏటీఎఫ్ మండిపడింది. వచ్చే ఫిబ్రవరిలోగా టెర్రరిజంపై గట్టి చర్యలు తీసుకోకుంటే గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్టులోకి మార్చడం తప్పదని హెచ్చరించింది.
కేవలం ఐదింటిలోనే..
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఐదురోజులపాటు జరిగిన ప్లీనరీలో పాక్‌ను గ్రే లిస్టులోనే ఉంచాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి టెర్రర్ సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకునేందుకు పాకిస్తాన్‌కు ఎఫ్ఏటీఫ్ 27 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ సూచించగా.. అందులో ఐదింటిలో మాత్రమే పాక్ పనితీరు సంతృప్తికరంగా ఉంది. మిగతా 22 పాయింట్లను అమలు చేయడంలో విఫలమైంది. ‘‘పాక్‌ను మరోసారి గ్రే లిస్టులోనే ఉంచాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్పూర్తిగా చేపట్టకపోతే.. పాక్‌పై ఎఫ్ఏటీఎఫ్ చర్యలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్.. పాక్‌తో కొనసాగించే వ్యాపార సంబంధాలు, ఇతర లావాదేవీల విషయంలో ఆంక్షలు విధిస్తుంది” అని ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే బ్లాక్ లిస్టులో ఉన్న ఇరాన్‌కు కూడా ఎఫ్ఏటీఎఫ్ ఇలాంటి హెచ్చరికలే చేసింది.
దిగబోయి.. జారిపోయె…
అలస్కాలో ప్యాసింజర్లతో వెళ్తున్న ప్లేన్ దిగుతూ, దిగుతూ.. పక్కకు జారి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. మరో 10 మందికి చిన్న దెబ్బలు తగిలాయి. పెనిన్సులా ఎయిర్‌వేస్‌కు చెందిన ఫ్లైట్ రన్‌వే నుంచి పక్కకు వెళ్లటంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన టైంలో ఫ్లైట్‌లో 42 మంది ప్యాసింజర్లు ఉన్నారని వారిలో హై స్కూల్ స్విమ్మింగ్ టీమ్ ఉందన్నారు. స్విమ్మింగ్ టీమ్‌కు ప్రమాదం జరగలేదని స్కూల్ మేనేజ్‌మెంట్ చెప్పింది.