ఎనిమిదోసారి ఏషియన్‌‌ బిలియర్డ్స్‌‌ టైటిల్‌‌ నెగ్గిన పంకజ్‌‌ అద్వానీ

ఎనిమిదోసారి ఏషియన్‌‌ బిలియర్డ్స్‌‌ టైటిల్‌‌ నెగ్గిన పంకజ్‌‌ అద్వానీ

దోహా: ఇండియా స్టార్‌‌ క్యూయిస్ట్‌‌ పంకజ్‌‌ అద్వానీ.. ఎనిమిదోసారి ఏషియన్‌‌ బిలియర్డ్స్‌‌ టైటిల్‌‌ను గెలిచాడు. శనివారం జరిగిన ఏషియన్‌‌ బిలియర్డ్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో పంకజ్‌‌ 6–2తో  ధ్రువ్‌‌ సిత్వాలాపై నెగ్గాడు. కెరీర్‌‌లో పంకజ్‌‌కు ఇది 40వ ఇంటర్నేషనల్‌‌ టైటిల్‌‌ కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తొలి రెండు ఫ్రేమ్‌‌ల్లో సులువుగా నెగ్గిన పంకజ్‌‌ 2‑0 లీడ్‌‌లో నిలిచాడు. థర్డ్‌‌ ఫ్రేమ్‌‌లోనూ 84–14 స్కోరుతో వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఫోర్త్‌‌ ఫ్రేమ్‌‌లో పుంజుకున్న ధ్రువ్‌‌ బ్రేక్‌‌ (82) సాధించాడు. కానీ ఐదో ఫ్రేమ్‌‌లో మళ్లీ పంకజే నెగ్గగా, తర్వాతి ఫ్రేమ్‌‌ను ధ్రువ్‌‌ నిలబెట్టుకున్నాడు.  ఏడో ఫ్రేమ్‌‌లో గెలిచే చాన్స్‌‌ను ధ్రువ్‌‌ వృథా చేసుకోవడం పంకజ్‌‌కు కలిసొచ్చింది. వరుసగా రెండు ఫ్రేమ్‌‌లు గెలిచి టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు.