
ఈ మధ్య యాభై ఏండ్ల వాళ్లలో కూడా చాలామందికి ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ లాంటి సమస్యలు వస్తున్నాయి. చర్మానికి సరైన పోషణ అందించక పోవడమే దీనికి కారణం. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ముడతలు, డల్ స్కిన్ సమస్య నుంచి దూరం కావచ్చని చెప్తున్నారు డాక్టర్. రింకీ కపూర్. బచ్చలికూరలో అన్ని రకాల విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, బీటా కెరోటిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్నిహైడ్రేట్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, చర్మాన్ని మృదువుగా కనిపించేలా చేస్తుంది బచ్చలికూర. జుట్టు బలంగా ఉంటుంది కూడా. బ్రకోలిలో విటమిన్– సి, కె, ఫైబర్, ఫోలేట్, కాల్షియం పుష్కలం. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ ఏజెనింగ్ ప్రాపర్టీలుగా పని చేసి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదం, వాల్‌నట్స్‌లో ఒమెగా–3 ఫ్యాట్, విటమిన్– ఇ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడతాయి. చర్మాన్ని లోపల నుంచి రిపేర్ చేసి, మెరిసేలా చేస్తాయి. ఎండ, పొల్యూషన్ వల్ల పాడవుతున్న చర్మాన్ని బ్లూ బెర్రీస్ కాపాడతాయి.
వీటిలో ఉండే విటమిన్–ఎ, సి, చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బొప్పాయిలో విటమిన్– ఎ, బి, సి, కె, ఇ, కాల్షియం, ఫాస్పరస్, న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే ముడతల్ని తగ్గించి ముసలి తనపు ఛాయలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే పపైన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి చర్మం మీద డెడ్ సెల్స్‌ను తొలగిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడానికి, చర్మంపై ఉన్న మృత కణాలను పోగొట్టడానికి కందగడ్డ సాయపడుతుంది. దీంట్లో ఉన్న ఫైబర్, విటమిన్–ఎ, సి, ఇ చర్మాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనోల్స్, యాంటీ ఏజింగ్ విటమిన్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, తేమగా చేస్తాయి. దానిమ్మలో ఉండే విటమిన్– సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చిరు ధాన్యాల్లో ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ ఏజెనింగ్ ప్రాపర్టీలుగా పనిచేస్తాయి. కోడి గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక గుడ్డు తింటే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.