పారాసిటమల్‌‌ ట్యాబ్లెట్ ధర రూ.2.88

పారాసిటమల్‌‌ ట్యాబ్లెట్ ధర రూ.2.88
  • మొత్తం 84 డ్రగ్‌‌ ఫార్ములేషన్స్‌‌కు రేట్లను ఫిక్స్‌‌ చేసిన ఎన్‌‌పీపీఏ

న్యూఢిల్లీ: దేశంలో అమ్ముడవుతున్న 84 రకాల డ్రగ్ ఫార్ములేషన్స్‌‌కు  నేషనల్ ఫార్మాస్యూటికల్‌‌ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌పీపీఏ) రేట్లను ఫిక్స్ చేసింది.  డయాబెటిస్‌‌, తలనొప్పి, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి వివిధ ట్రిట్‌‌మెంట్ల కోసం వాడే డ్రగ్స్‌‌ కూడా ఇందులో ఉన్నాయి. కొలెస్ట్రాల్‌‌, ట్రైగ్లిజరైడ్స్‌‌  లెవెల్‌‌ను తగ్గించేందుకు వాడే డ్రగ్స్‌‌ రేట్లను కూడా ఎన్‌‌పీపీఏ మార్చింది. తాజాగా విడుదల చేసిన నొటిఫికేషన్ ప్రకారం, వోగ్లిబోస్‌‌, మెట్‌‌ఫార్మిన్‌‌ హైడ్రోక్లోరైడ్‌‌ ట్యాబ్లెట్‌‌ ధరను రూ. 10.47 (జీఎస్‌‌టీ మినహాయించి) గా నిర్ణయించారు. ఒక్కో పారాసిటమల్‌‌, కెఫిన్‌‌ ట్యాబ్లెట్‌‌ రేటు రూ. 2.88 గా,  రోసువస్టాటిన్‌‌ ఆస్పిరిన్‌‌, క్లోపిడగ్రెల్‌‌ క్యాప్సుల్‌‌ రేటు రూ. 13.91 గా నిర్ణయించారు. కొత్త   మెడికల్ ఆక్సిజన్‌‌  రేట్లను  ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగించేందుకు ఎన్‌‌పీపీఏ అనుమతిచ్చింది.