ParliamentAttack: ఎంపీ ప్రతాప్ సింహా ఎవరు.? నిందితులతో సంబంధం ఏంటి.?

ParliamentAttack: ఎంపీ ప్రతాప్ సింహా ఎవరు.? నిందితులతో సంబంధం ఏంటి.?

లోక్ సభలోకి ఇద్దరు  వ్యక్తులు  దూసుకొచ్చి స్ప్రే కొట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. లోక్ సభలో ఇద్దరు..బయట మరో ఇద్దరు స్ప్రేలతో గందరగోళం సృష్టించిన నలుగురిని పార్లమెంట్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను సాగర్ శర్మ, మనోరంజన్‌లుగా గుర్తించారు. లోక్ సభలోకి దూసుకొచ్చిన నిందితులిద్దరు  కర్ణాటకలోని మైసూరుకు చెందిన  బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా  విజిటింగ్ పాస్ తో లోపలికి వచ్చారని విచారణలో తేలింది.. అయితే నిందితులకు పాసులు జారీ చేసిన ఎంపీ ప్రతాప్ సిన్హాకు నిందితుడు మనోరంజన్ కు   ఉన్న సంబంధం ఏంటి..వారికి పాసులు ఎందుకు జారీ చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు నిందితుడు మనోరంజన్ తండ్రి పరిచయం.. కానీ ఆయనకు బీజేపీతో కానీ మరే ఇతర రాజకీయ పార్టీతో కానీ సంబంధం లేదు. నిందితుడు మనోరంజన్ ఇల్లు   బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పార్టీ కార్యాలయానికి దగ్గర ఉంటుంది. మనోరంజన్, అతని స్నేహితుడు  సాగర్ శర్మ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించాలనే వంకతో  గత మూడు నెలలుగా  విజిటర్స్ పాస్ కోసం ప్రయత్నించారు. దీంతో   డిసెంబర్ 13న పార్లమెంట్ ను సందర్శించేందుకు ఆ ఎంపీ వారి పాస్ లపై సంతకాలు చేశారు. దీంతో మనో రంజన్  తన స్నేహితుడు సాగర్ శర్మతో కలిసి పార్లమెంట్ విజిటర్స్ హాల్ లోకి  ప్రవేశించారు. 

  • ప్రతాప్ సింహా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మైసూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో మైసూర్‌లో 31,608 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అడ్డగూరు హెచ్ విశ్వనాథ్‌పై ప్రతాప్ సింహా విజయం సాధించారు.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో మైసూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సీహెచ్‌ విజయశంకర్‌పై ప్రతాప్‌సింహ 1,38,647 ఓట్ల తేడాతో విజయం సాధించారు.