ఆన్లైన్లో పార్టీ కండువాలు దొరుకుతున్నై

ఆన్లైన్లో పార్టీ కండువాలు దొరుకుతున్నై

ఇంటికి, వంటగదికి, ఆఫీస్ కి ఏ వస్తువు కావాలన్నా జనాలు ఆన్ లైన్ షాపింగ్ సైట్ల వైపు చూస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఒక్కనొక్కు నొక్కితే చాలు కావాల్సినవన్నీ కళ్లముందుకొస్తాయి. అలాంటి ఆన్ లైన్ జమానాల సబ్బులు, సర్పులతో పాటు రాజకీయ పార్టీల జెండాలు, కండువాలు, టోపీలు కూడా అమ్ముతున్నారు. ఈ కామర్స్ సైట్లలో వీటి ఫొటోలు కనిపించేసరికి ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.

ఇదివరకు షాపుల్లో ఇచ్చిన ఆర్డర్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. పార్టీ మీటింగ్, ర్యాలీల సమయంలో జెండాలు సమయానికి  అందక పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడేవాళ్లు. అలాంటిది ఆన్ లైన్ మార్కెట్ లో ఇవి దొరుకుతుండే సరికి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫ్రీగా పంచే జెండాలు, కండువాలను ఆన్ లైన్ లో డబ్బులు పెట్టి ఎవరు కొంటారు అన్నది ప్రశ్నగా మారింది.