వందేభారత్ రైల్లో ఫుడ్ కంపు కొడుతుంది

వందేభారత్ రైల్లో ఫుడ్ కంపు కొడుతుంది

మీరు విన్నది నిజమే.. వందే భారత్ రైళ్లో ఫుడ్ కంపు కొడుతోంది. రైళ్లలో ఫుడ్ అందించే విక్రేతలు నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. చెడిపోయిన దుర్వాసనతో కూడిన ఫుడ్ సప్లయ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ట్వీట్ చేసి ఫిర్యాదు చేశారు. రైళ్లలో అందించే ఆహారం దుర్వాసన, పాచిపోయి ఉంటుందని.. దయచేసి మా డబ్బు  తిరిగి చెల్లించండి.. విక్రేతలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బ్రాండ్ ను చెడగొడుతన్నారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. 

న్యూఢిల్లీ నుంచి వారణాసి  వందే భారత్ ఎక్స్ ప్రెస్  రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికులకు ఈ ఘటన ఎదురైంది. రైలులో సప్లయ్ చేసిన ఫుడ్ దుర్వాసన వస్తోందని ఫుడ్ ట్రేల ను కిందపడేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం వైరల్ గా మారింది. ఏకంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ పోస్ట్ ను షేర్ చేశారు. ప్రయాణికుల ఫిర్యాదుల ను తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ ఫుడ్ సప్లయర్ కు జరిమానా విధించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం, అసంతృప్తికి క్షమాపణలు.. సర్వీస్ ప్రొవైడర్ కు జరిమానా విధించాం. ఇకపై ఇలాంటివి జరగ్గకుండా పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు రైల్వే శాఖ అధికారులు.