ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

దాడి కేసులో జిల్లా కోర్టు శిక్ష 
స్టే విధించిన హైకోర్టు 
ఆలస్యంగా రావడంతో డిస్మిస్​చేసిన సప్రీంకోర్టు 

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఓ కంపెనీపై దాడి చేశారన్న అభియోగంతో సంగారెడ్డి జిల్లా కోర్టు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి 2016లో రెండున్నరేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై మహిపాల్​రెడ్డి అదే ఏడాది హైకోర్టుకు వెళ్లగా స్టే లభించింది. దీన్ని సవాలు చేస్తూ న్యాయవాది ముఖీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. అయితే, హైకోర్టులో కేసు కొట్టేశారని, సుప్రీం కోర్టులో అప్పీల్​కు వచ్చే టైం కూడా అయిపోయిందని మహిపాల్​రెడ్డి తరఫున అడ్వొకేట్లు వాదించారు. దీంతో ఏకీభవించిన జస్టిస్​సుందరేశ్, జస్టిస్​అరవింద్ కుమార్​లతో కూడిన ద్విసభ్య బెంచ్​కేసును డిస్మిస్ చేసింది. దీంతో పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఊరట లభించినట్టయ్యింది.