
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్ట్ బస్సు సంజీవిని వద్ద కుప్పకూలి మృతి చెందాడు.
తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన యువకుడు గత మూడు రోజులుగా ఒళ్లు నొప్పిలు, జ్వరంతో బాధపడుతున్నాడు. టెస్ట్ లు ఎక్కడ చేస్తారో తెలియక ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు 108 ఫోన్ చేశారు. గంట తరువాత వచ్చిన అంబులెన్స్ లో రుయా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే లోపు బాధితుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బిడ్డ చనిపోయిన విషయం తెలియని తండ్రి కుమారుడి కాళ్లు పట్టుకొని ఒళ్లు నొప్పులు తగ్గించే ప్రయత్నం చేయడం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది.