
కైకలూరు జిల్లాలోని వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను తీసుకొస్తామన్నారు. జనసేన, టీడీపీ గెలిస్తే మీరు మీ ఆఫీసుల్లోనూ... మీ ఇళ్లల్లో ఉండండి అప్పుడు చూస్తాం అంటూ హెచ్చరించారు. ఏ పోలీసులతో జనసేన కార్యకర్తలతో కేసులు పెట్టించారో ఆ పోలీసులతోనే వైసీపీ నేతల మక్కెలు విరగ్గొట్టిస్తామన్నారు. తాను ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి.. పోతే ఏంటి.. వైసీపీ నేతలకు ఎందుకంత భయమని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీరు భయపడ్డారంటే... బలహీనపడ్డట్టే నంటూ తాటాకు చప్పుళ్లకు బెదరమన్నారు. 2014లో తెలుగుదేశం, బీజేపీ ఓడిపోతే జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 2019లో వైసీపీ గెలిచిన తరువాత తాను ఎక్కడికి పోలేదన్నారు. నేను వైఎస్సార్ నే ఎదిరంచా.. నీవెంత.. అంటూ జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను కులాల పరంగా విడగొడితే చూస్తూ ఊరుకోనన్నారు.
ఎన్టీఏతో పొత్తు విషయంలో స్పందించిన పవన్ దొంగచాటుగా బయటకు రాను.. వస్తే అందరికి చెప్పే బయటకు వస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ 8600 కోట్ల రూపాయిల పంచాయితి నిధులను దారి మళ్లించాడని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కొల్లేరు నీటి సమస్యను తీరుస్తానన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. ఏదైనా గ్రామంలో మద్యంవద్దని మహిళలు కోరితే ఆ గ్రామంలో మద్యనిషేధం అమలు చేస్తామన్నారు.