హిందీలోనూ అలరించనున్న ‘భీమ్లా నాయక్’

హిందీలోనూ అలరించనున్న ‘భీమ్లా నాయక్’

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో మ్యాన్ రానా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇచ్చారు. భీమ్లా నాయక్ ను హిందీలోనూ విడుదల చేస్తున్నామని తెలిపారు. తెలుగు, హిందీ వెర్షన్ లు ఏకకాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతాయని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తి తగ్గితే శివరాత్రికి భీమ్లా నాయక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

‘అయ్యప్పన్ కోషియుమ్ ఓటీటీలో రాగానే చూశా. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి చూడాలని చెప్పా. ఆయన చూసిన అనంతరం నన్ను కొనమన్నారు. అలా భీమ్లా నాయక్ ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఒరిజినల్ లో లేని కొత్త ఎలిమెంట్స్ ను భీమ్లా నాయక్ లో చూస్తారు. త్రివిక్రమ్ ఇందులో చేసిన మ్యాజిక్ ను తెర పైనే చూడాలి. ప్లాట్ లైన్ ను ఒకటే.. కానీ త్రివిక్రమ్ పలు మార్పులు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారు. త్రివిక్రమ్ రాసింది స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో దర్శకుడు సాగర్ సక్సెస్ అయ్యాడు’ అని నాగ వంశీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

కరోనా లేకుంటే మా పెళ్లి అయిపోయేది

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

హిజాబ్ వివాదంపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం