Pushpa2: పుష్ప 2 లో పవర్ స్టార్..ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం! 

Pushpa2: పుష్ప 2 లో పవర్ స్టార్..ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం! 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్స్, టీజర్   రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి.

తాజా సమాచారం ప్రకారం..పుష్ప 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాగం కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ అవతారం దర్శనం ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కి ఓ వైపు పిచ్చేక్కితుంటే..ఇక పవర్ స్టార్ ఇందులో భాగం అవుతున్నాడనే వార్తా మరింత హైప్ ఎక్కిస్తుంది. మరి ఈ సినిమాలో పవన్ నటిస్తున్నారా? లేదా ఏదైనా క్యామియో రోల్ చేస్తున్నాడా అనే డౌట్ వస్తుంది కదూ.. నిజానికి ఈ సినిమాలో పుష్పరాజ్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చే కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నారట.ఇదే కనుక కన్ఫమ్ అయితే సుక్కు ప్లాన్ నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవాలి. మరి పవన్ పుష్ప 2 విషయంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఐకాన్ ఫ్యాన్స్..మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ 2024 ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా  థియేటర్లోకి రానుంది.