రూ.290 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టాలు

రూ.290 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో తమ నష్టాలు రూ.290 కోట్లకు తగ్గినట్టు ఫిన్​టెక్​ మేజర్​ పేటీఎం ప్రకటించింది. 2022 రెండో క్వార్టర్​లో ఈ సంస్థకు రూ.571 కోట్ల నష్టం వచ్చింది. అయితే తాజా క్వార్టర్​లో రెవెన్యూ వార్షికంగా 32 శాతం పెరిగి రూ.2,519 కోట్లకు చేరింది. ఇబిటా రూ.84 కోట్ల నుంచి రూ.153 కోట్లకు పెరిగింది. కంట్రిబ్యూషన్​  ప్రాఫిట్​ ఈ క్వార్టర్​లో వార్షికంగా 69 శాతం పెరిగి రూ.1,426 కోట్లకు చేరింది. 

కంట్రిబ్యూషన్​ మార్జిన్​ 57 శాతం ఉంది. పేమెంట్స్​ బిజినెస్​ 28 శాతం వృద్ధి చెందింది. దీని నుంచి రూ.1,524 కోట్లు వచ్చాయి. నెట్​ పేమెంట్​ బిజినెస్​ 60 శాతం పెరిగి రూ.707 కోట్లకు చేరింది.  పేమెంట్స్ సెగ్మెంట్​ నుంచి జీఎంవీ వార్షికంగా 41 శాతానికి పెరిగి రూ.4.5 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్​ సర్వీసెస్​ నుంచి రూ.571 కోట్లు వచ్చాయి. లోన్​ కస్టమర్ల సంఖ్య 1.18 కోట్ల మందికి చేరింది. లోన్ల జారీ 122 శాతం పెరిగి రూ.16,211 కోట్లకు ఎగిసిందని పేటీఎం తెలిపింది.