మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబం రూ.47 వేల కోట్లు కాజేసిన్రు : వివేక్ వెంకటస్వామి

 మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబం రూ.47 వేల కోట్లు కాజేసిన్రు :   వివేక్ వెంకటస్వామి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబం రూ.47 వేలకోట్లు కాజేశారని ఆరోపించారు.  కాళేశ్వరం కట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని విమర్శించారు.  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ 

మీటింగ్ కు ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్ రావు,INTUC నేత జనక్ ప్రసాద్ ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ...   పెద్దపల్లికి తమ కుటుంబం ఎంతో చేసిందన్నారు. గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కొలువుల జాతర ఉంటుందన్నారు.   సింగరేణి సంస్థలో  5 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పుకొచ్చారు. 100 రోజుల్లో సిల్క్ డెవలప్  మెంట్ సెంటర్లు ఏర్పాటు  చేశామని వెల్లడించారు.  

3 నెలల్లోనే కాంగ్రెస్ అద్భుతమైన ఫథకాలు ప్రవేశ పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.  పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుందని.. ప్రజలకు సేవల చేయాలని భావిస్తే రాజకీయాలు వేరే ఉంటాయని  చెప్పారు.  కాకాపై ఉన్న అభిమానం ప్రజల్లో చెక్కు చెదరలేదన్నారు.  మీ అందరి అభిమానంతో గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.