
ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. ఒకటికి మించి కార్డులుంటే ఫైన్ తప్పదంటున్నారు అధికారులు. ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులుంటే వెంటనే వాటిని సంబంధిత అధికారులకు సమర్పించాలని…లేదంటే 10 వేల రూపాయల జరిమానా తప్పదంటున్నారు.
ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్‌ను కలిగి ఉండాలని ఆదాయపు పన్ను చట్టం1961 లోని సెక్షన్ 139 A తెలుపుతోంది. దీన్ని అతిక్రమిస్తే ఫైన్ వేయాల్సిందేనని అధికారులు నిర్ణయించారు. కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా ఎక్కువ పాన్‌కార్డులను ఉన్నవారు వెంటనే వాటిని అధికారులకు సమర్పించి, జరిమానా నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పిస్తోంది. NRI లు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులుండే అవకాశం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఐటీ వెబ్‌సైట్‌కు వెళ్లి సరెండర్ డూప్లికేట్ పాన్ ఆప్షన్ క్లిక్ చేసి… అడిగిన వివరాలు తెలిపి… అదనంగా ఉన్న పాన్ కార్డులను రద్దు చేసుకోవచ్చని తెలిపారు అధికారులు.