విల్ నుంచి రెండు మొబిలిటీ కుర్చీలు

విల్ నుంచి రెండు మొబిలిటీ కుర్చీలు

పర్సనల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన విల్ ...ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్ట ప్ అయిన ఈ–బైక్​గో సహకారంతో రెండు ఎలక్ట్రిక్​ మొబిలిటీ కుర్చీలను లాంచ్​ చేసింది. మొదటిది సీ2.. ఇది మొబిలిటీ కుర్చీ.  ఇది ఆఫ్-రోడ్​లో పనిచేస్తుంది. సీ2ని నడపడం చాలా సులభం.  దీంతో ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లవచ్చు. మలుపుల్లో కూడా సులభంగా తిప్పవచ్చు.  ఐదు గంటల ఛార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో 18 కిలోమీటర్లు వెళ్తుంది. రెండోది మోడల్​ ఎఫ్. ఈ మొబిలిటీ కుర్చీని మడత పెట్టవచ్చు.  పూర్తిగా ఛార్జ్ చేస్తే 20 కిలోమీటర్లు వెళ్తుంది. సులభంగా బస్సులు, రైళ్లు,  విమానాలలో తీసుకువెళ్లవచ్చు.