ఆర్కిటెక్చర్​లో పీజీ కోర్సులు

ఆర్కిటెక్చర్​లో పీజీ కోర్సులు

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్​పీఏ) 2023– -24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ఆర్కిటెక్చర్ అండ్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ స్పెషలైజేషన్లలో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. 

ఆర్కిటెక్చర్ విభాగాలు: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సస్టైనబుల్ ఆర్కిటెక్చర్), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ల్యాండ్‌‌‌‌‌‌‌‌స్కేప్ ఆర్కిటెక్చర్), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్), మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజినీరింగ్ అండ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, మాస్టర్ ఆఫ్ అర్బన్ డిజైన్

ప్లానింగ్ విభాగం: మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్), మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (అర్బన్ అండ్‌‌‌‌‌‌‌‌ రీజినల్ ప్లానింగ్), మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్)

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌‌‌‌‌‌‌‌, బీఆర్క్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ పర్పస్, పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌, స్కూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ అర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్​కు ఏప్రిల్​ 10 వరకు పంపాలి. వివరాలకు www.spav.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.