కూతురు కోసం రోడ్డు పక్కన షాపులో క్యాండీ కొన్న రాఖీభాయ్

కూతురు కోసం రోడ్డు పక్కన షాపులో క్యాండీ కొన్న రాఖీభాయ్

హీరో యశ్ .. ఫ్యాన్స్ ముద్దుగా రాఖీ భాయ్ అని పిలుచుకుంటారు. కేజీఎఫ్ చాప్టర్ 1, 2తో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ కన్నడ హీరో. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకంటారు? కదా? ఎంత పెద్ద స్టార్లైనా వాళ్లకంటూ ఓ  కుటుంబం, బంధాలుబంధుత్వాలు, ఎమోషన్స్ ఉంటాయి కదా.. సరదాగా కుటుంబంతో గడపాలని వాళ్లకు ఉంటుంది. 

లేటెస్ట్ గా యశ్ తన భార్య రాధికా పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని  భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న  ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని సందర్శించారు. అనంతరం వస్తుండగా దారిలో తన కూతరి కోసం కారు దిగి రోడ్డు పక్కన ఉన్న కిరాణ షాపులో క్యాండీ కొనిచ్చాడు.  అంతేకాదు షాపు ముందు  టేబుల్ పై  యశ్ భార్య  ఐస్ క్రీం తింటూ కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ యశ్ భాయ్ పెద్ద హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటున్నాడు.. చిన్న  షాపులో తక్కవ ఖరీదైనవి పిల్లలకు కొనియ్యడం తన సింప్లిసిటీకి కారణమంటూ  కామెంట్ చేస్తున్నారు. 

మరో వైపు  చిత్రపూర్ మఠాన్ని సందర్శించేందుకు వచ్చారని తెలిసిన ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్ ను కట్టడి చేశారు.  యశ్  ప్రస్తుతం  ట్యాక్సిక్..  ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గీతు మోహన డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.