అమర్ నాథ్ యాత్రకు ఉగ్రముప్పు..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

అమర్ నాథ్ యాత్రకు ఉగ్రముప్పు..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

పవిత్ర అమర్ నాథ్ యాత్ర ఫస్ట్ బ్యాచ్ జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరింది. జమ్మూలోని యాత్రి నివాస్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్ నాథ్ యాత్రికుల ఫస్ట్ బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో తెల్లవారుజామున 3 వేల మందికి పైగా యాత్రికులు బోళా శంకరుడిని దర్శనానికి బయలుదేరారు. రెండేళ్ల తర్వాత మళ్లీ యాత్ర మొదలవ్వటంతో బమ్ బమ్ భోలే, హర, హర మహాదేవ్ అంటూ యాత్రికులు ముందుకు సాగారు. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభమై...ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో యాత్రికులు వస్తారని జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. ఈ యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు CRPFకు చెందిన బైక్ స్వ్కాడ్ కమాండోలు ఎస్కార్ట్ చేస్తున్నారు. మరోవైపు యాత్రకు బయలు దేరిన వాహనాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లు యాడ్ చేశారు.