Good Health : పైనాపిల్ మంచే చేస్తది.. మంచి ఆరోగ్యానికి ఇలా..

Good Health : పైనాపిల్ మంచే చేస్తది.. మంచి ఆరోగ్యానికి ఇలా..

సీజన్ మారితే జలుబు చేస్తుంటుంది కొందరు పిల్లలకి. ఆ వెంటనే దగ్గు, గొంతు, తల నొప్పులు వస్తాయి. వీటన్నింటికీ వంటింటి చిట్కాలు చాలానే ఉన్నా.. పైనాపిల్ జ్యూస్ కూడా బెస్ట్ మెడిసిన్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్ కవిత దేవగన్. అసలు పైనాపిల్కి, జలుబుకి లింక్ ఏపిల్ తినడం వల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో కూడా చెప్పారామె.

జలుబు చేస్తుందేమోనని సీజన్ లో జ్యూస్లు తాగరు చాలామంది. కానీ జ్యూస్ కి, జలుబుకి సంబంధమే లేదు. నిజానికి కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు జలుబు, దగ్గుల నుంచి రిలీఫ్ ఇస్తాయి కూడా. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు పైనాపిల్ జ్యూస్ తాగితే బోలెడు లాభాలున్నాయి. జలుబు ఎలా తగ్గుతుంది? పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. 

వీటిల్లో విటమిన్ -సి కూడా పుష్కలం. ఇవి రెండూ కలిసి నాసిల్ కావిటీలో ఇన్ ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తాయి. శ్వాస కోశ సిస్టమ్ ఉన్న మ్యూకస్ని పోగొడతాయి. దాంతో జలుబు, దగ్గు నుంచి త్వరగా రిలీఫ్ వస్తుంది. పైనాపిల్ జ్యూస్ తాగితే శ్వాస నాళాల వాపు కూడా తగ్గుతుంది. అలాగే దక్షిణ అమెరికా, యూరప్ దేశాల నుంచి మనదగ్గరికి వచ్చిన ఈ సూపర్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ కూడా ఎక్కువే..

పైనాపిల్ జ్యూస్.. 

కావాల్సినవి..

పైనాపిల్ ముక్కలు 
రెండు కప్పులు అల్లం తరుగు రెండు టీ స్పూన్ లు
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు చిటికెడు 

తయారీ..

పైనాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీజార్లో వేయాలి. అందులో సన్నగా తరిగిన అల్లం, చక్కెర, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వడగట్టి పైనుంచి పుదీనా వేసుకుని తాగితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

లాభాలెన్నో..

పైనాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. వీటిల్లోని మినరల్స్, ఎంజైమ్స్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. అలాగే పైనాపిల్ లోని విటమిన్ - సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. కంటి చూపుని కాపాడుతుంది. చర్మాన్ని మెరిపిస్తుంది కూడా. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పైనాపిల్ గుండె సంబంధిత జబ్బులని దూరంగా ఉంచుతుంది. బాడీ ఫంక్షనింగ్ సజావుగా అయ్యేలా చూస్తుంది.

ఆక్సిడేటివ్ స్ట్రెస్, క్రానిక్ఇన్ ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే పైనాపిల్ ఆ రెండింటినీ తగ్గించి క్యాన్సర్ నుంచి కాపాడుతుందని స్టడీలు చెబుతున్నాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సైనస్ ని కంట్రోల్ చేస్తుంది. పైనాపిల్ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వీటిల్లోని విటమిన్ - బి బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా జరిగేలా చేసి, స్ట్రెస్ ని దరిచేరనివ్వదు. 

ఈ ఫ్రూట్ మాంగనీస్ ఎక్కువ. ఇది ఎముకల మినరల్ డెన్సిటినీ పెంచి, బలాన్నిస్తుంది. ఇదే విషయాన్ని చాలా స్టడీలు కూడా చెప్పాయి. అలాగే ఆడవాళ్లని బోలు ఎముకల డిసీజ్ (వయసు పైబడ్డాక ఎముకలు మెత్తబడటం) నుంచి బయటపడేస్తాయి. వీటిల్లోని బ్రోమలైన్ ఎంజైమ్ గాయాలకి మందులా పనిచేస్తుంది. దెబ్బ తగిలినప్పుడు వాపు రాకుండా చూస్తుంది. రక్తం గడ్డ కట్టేలా చేసి బ్లడ్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని కూడా వేగవంతం చేస్తుంది.

Also Read :- మగాళ్ల ముఖం మెరవాలంటే.. నిగనిగలాడాలంటే ఏం చేయాలి..