పోర్టిఫైడ్​ రైస్​ను.. ప్లాస్టిక్​ రైస్​ అనుకుని తగలబెట్టెరు

పోర్టిఫైడ్​ రైస్​ను.. ప్లాస్టిక్​ రైస్​ అనుకుని తగలబెట్టెరు

మిడ్జిల్, వెలుగు: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయన్న వార్త మండల కేంద్రంలో కలకలం రేపింది. మంగళవారం మిడ్జిల్ గ్రామానికి చెందిన ఓ మహిళ రేషన్ బియ్యం వండి తింటున్నప్పుడు అన్నం సాగుతున్నట్లు అనిపించింది.

అనుమానంతో బియ్యం గింజలను అగ్గిపుల్లతో వెలిగిస్తే పూర్తిగా కాలిపోయాయి. దీంతో సదరు మహిళ చుట్టుపక్కల వారిని పిలిచి చూపించింది. వారు కూడా తాము తీసుకొచ్చిన రేషన్ బియ్యంలో తేడాను గమనించారు. దీనిపై రేషన్ డీలర్లను వివరణ కోరగా ఇవి ప్లాస్టిక్​ బియ్యం కావని, వీటిని పోర్టిపైడ్ రైస్ గా పిలుస్తారని తెలిపారు. విటమిన్లతో కూడిన ఈ రైస్​ను రేషన్​బియ్యంలో కలుపుతారని చెప్పారు. వీటిని తినడం వలన ఎటువంటి ప్రమాదం లేదన్నారు.