
రెండవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోడీ… తర్వాత కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉగ్రవాదులు మోడీని లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబరు 8వ తేదీన హర్యానాలోని రోహ్‌తక్ రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామని, అక్కడి పోలీసులకు లేఖ అందింది. తాజాగా మరోసారి జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ప్రధాని మోడీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను తమ హిట్‌లిస్ట్‌లో చేర్చినట్లు పౌరవిమానయాన విభాగం బ్యూరో సెక్రటరీకి లేఖ అందింది. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు మరో 30నగరాల మీద దాడి చేస్తామని అందులో తెలిపారు.