
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పవిత్ర మంచుకొండల మధ్య ధ్యానం చేస్తున్నారు. ఈ ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదారినాథ్ కు వెళ్లారు ప్రధాని. అక్కడ కేదారి నాథ్ ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నారు.
2 కిలోమీటర్ల పాటు మోడీ ట్రెక్కింగ్
కేదారినాథ్ ప్రయాణాన్ని ఈ ఉదయం ప్రధానమంత్రి మొదలుపెట్టినట్టు అధికారులు తెలిపారు. 2 కిలోమీటర్ల పొడవునా.. ఆయన మంచుకొండలపై ట్రెక్కింగ్ చేశారు. ఆ తర్వాత కేదారినాథ్ ఆలయం చేరుకున్నారు.
కేదారినాథ్ మంచు కొండల మధ్య ప్రధానమంత్రి ధ్యానం చేయాలని నిర్ణయించారు. మీడియా రిక్వెస్ట్ చేయడంతో.. మోడీ ధ్యానం ఆరంభానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలకు అనుమతించారు. నరేంద్రమోడీ ధ్యానం రేపు ఉదయం వరకు కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ప్రశాంతతకు అడ్డు రాకూడదని… మీడియా, ప్రెస్ ప్రతినిధులను ఆయన ధ్యానం చేస్తున్న ప్రాంతానికి అనుమతించడం లేదని తెలిపారు.