పీవీ సింధును అభినందించిన మోడీ

పీవీ సింధును అభినందించిన మోడీ

సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. " తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నందుకు పీవీ సింధుని నేను అభినందిస్తున్నాను. ఆమె మరోసారి తన అసాధారణమైన క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశానికి గర్వకారణం.. రాబోయే క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది" అని ప్రధాని ట్వీట్ చేశారు.

మహిళల సింగిల్స్ లో చైనా క్రీడాకారిణి వాంగ్ జిపై 21-9, 11-21, 21-15 తేడాతో గెలుపొందింది సింధు. ఫస్ట్ నుంచి పదునైన స్మాష్ షాట్లతో పీవీ సింధు ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ లో చైనా క్రీడాకారిణికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 21-9 తేడాతో గెలిచిన సింధు.. ఆ తర్వాతి సెట్ లో ఓడింది.

చివరి సెట్ లో మరింత దూకుడుగా ఆడిన సింధు.. 21-15 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. 2022లో రెండు సూపర్ టైటిల్ ను సింధూ దక్కించుకుంది. జులై 28నుంచి బర్మింగ్ హామ్ లో జరగనున్న కామన్ వెల్త్ గేమ్స్ కు ముందు ఈ  విజయం సిందుకు మరింత బూస్ట్ ను ఇవ్వనుంది. ఈ సీజన్ లో సింధుకు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.