అమ్మకు ప్రధాని మోడీ పాదాభివందనం

అమ్మకు ప్రధాని మోడీ పాదాభివందనం

ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ లోని  గాంధీనగర్ లో తల్లి  దగ్గరకు వెళ్లి  శుభాకాంక్షలు తెలిపారు.  తర్వాత తల్లి హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పటికే  గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ తల్లిని కలిశారు. ఈ ఏడాదితో హీరాబెన్ శత  వసంతంలోకి అడుగు పెట్టారు. దీంతో  గుజరాత్ లోని  ఓ రోడ్డుకు  ఆమె పేరు  పెట్టనున్నట్లు తెలుస్తోంది.  రైసెన్  ప్రాంతంలోని  80 మీటర్ల  రహదారికి  పూజ్య హీరాబా మార్గ్  అనే పేరు  పెట్టాలని నిర్ణయించినట్లు  గాంధీనగర్  మేయర్  హితేష్ మక్వానా  తెలిపారు.