
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ క్రికెట్ లెజెండ్ ప్లేయర్ మిథాలీ రాజ్‌పై.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. మిథాలీ ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడారు. ఇండియాలో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో మిథాలీ కూడా ఒకరని ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని అభివర్ణించారు. ‘మిథాలీ రిటైర్మెంట్ ఎంతో మంది క్రీడా ప్రేమికులను భావోద్వేగాలకు గురి చేసింది. ఆమె అత్యద్భుతమైన క్రికెటరే కాకుండా చాలా మంది ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచింది. భవిష్యత్తులో ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.