అగ్రి చట్టాలను ఏడాదిన్నర నిలిపేసేందుకు కట్టుబడి ఉన్నం

అగ్రి చట్టాలను ఏడాదిన్నర నిలిపేసేందుకు కట్టుబడి ఉన్నం
  • రైతులతో చర్చలకు ఒక్క కాల్ దూరంలో!
  • చర్చలతోనే పరిష్కారం
  • ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని
  • సెషన్ ఎజెండా ఖరారుపై చర్చ
  • 26న జరిగిన హింసను ఖండించిన అన్ని పార్టీల లీడర్లు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో ఆందోళనలు చేస్తున్న రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, వారికి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారని చెప్పారు. ఇదే విషయాన్ని రైతులకు తోమర్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు శనివారం అన్ని పార్టీలతో ప్రధాని మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ కు సంబంధించిన విషయాలను తర్వాత కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు.

దేశం గురించి ఆలోచించాలె

చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం వస్తుందని, దేశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ప్రధాని మోడీ కోరారు. ‘‘రైతులకు, కేంద్రానికి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. కానీ రైతులకు ఒక ఆఫర్ ఇచ్చాం. మీరు చర్చలకు వెళ్లండి. మీకు కేవలం ఫోన్ కాల్ దూరంలోనే తాను ఉన్నానని తోమర్ చెప్పారు” అని పేర్కొన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘‘రైతుల సమస్యలపై కేంద్రం ఓపెన్ మైండ్​తో వ్యవహరిస్తోంది. జనవరి 22న చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.

చిన్న పార్టీల గొంతు వినిపించాలి

‘‘పార్లమెంట్ సెషన్స్ సాఫీగా సాగాల్సిన అవసరం ఉంది. సభలో అంతరాయం వల్ల చిన్న పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. తమ సమస్యలను ఆ పార్టీలు లేవనెత్తలేకపోతున్నాయి. పార్లమెంటు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత పెద్ద పార్టీలదే. అంతరాయం కలగకుండా చూసుకోవాలి. చిన్న పార్టీలు పార్లమెంటులో తమ గొంతు వినిపించాలి” అని మోడీ చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం  చేయడాన్ని మోడీ ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని బీజేడీ డిమాండ్ చేయగా, టీఆర్ఎస్, వైఎస్సార్​సీపీ సపోర్ట్ చేశాయి.

చట్టం తన పని తాను చేసుకుపోతది
మీటింగ్‌కు హాజరైన కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ, శివసేన లీడర్ వినాయక్ రౌత్, శిరోమణి అకాలీదళ్ నేత బల్వీందర్ సింగ్ భుందర్ తదితరులు.. రైతుల నిరసనల అంశాన్ని లేవనెత్తారు. రిపబ్లిక్ డే రోజున చెలరేగిన హింస గురించి లీడర్లు ప్రస్తావించగా.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మోడీ చెప్పారు. రిపబ్లిక్ డే రోజున చెలరేగిన హింసను, జరిగిన విధ్వంసాన్ని అన్ని పార్టీలు ఖండించాయి. అయితే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పార్టీలను ఇందుకు బాధ్యులను చేయొద్దని కోరాయి.

For More News..

రికార్డుస్థాయిలో వరి సాగు.. ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో నాట్లు

ఏపీ అక్రమంగా 86 ప్రాజెక్టులు కడుతోంది

హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న లీజ్ ఫార్మింగ్

రాష్ట్ర చరిత్రలో ఫస్ట్​ టైమ్.. ఒక్క నెలలోనే 850 కోట్ల ఇన్‌కం